జూన్ 30వ తేదీన చినగంజాంలో జరగబోయే సైనిక్ వెల్ఫేర్ అధికారుల క్యాంప్‌ను మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చినగంజాం అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణ షీలా బృందం మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ ప్రత్యేక క్యాంప్‌ను మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.