రేపు జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి బి. ఎస్. పి

1003చూసినవారు
దళిత క్రైస్తవుల విషయమై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఆకివీడు గ్రామంలో జరిగిన దాడులను బాపట్ల జిల్లా BSP అధ్యక్షుడు గుదే రాజారావు ఖండించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించి, కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవులు, దళిత సంఘాలు, ప్రజలు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్