బాపట్ల జిల్లా అభివృద్ధిపై నేతలతో సమీక్షించిన మంత్రి కొలుసు

1176చూసినవారు
బాపట్ల జిల్లా అభివృద్ధిపై నేతలతో సమీక్షించిన మంత్రి కొలుసు
మంగళవారం బాపట్లలో బాపట్ల పార్లమెంట్ టీడీపీ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమావేశం జరిగింది. బాపట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రి కొలుసు పార్థసారధి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, జిల్లా అభివృద్ధికి తగు చర్యలు, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు ప్రజలలోకి తీసుకువెళ్లడం, పార్టీ బలోపేతం గురించి మంత్రి నాయకులతో చర్చించారు. ఈ సమావేశంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్