ఏరువాక పౌర్ణమి సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సోమవారం బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో రైతులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో నాగలి పట్టి పొలాన్ని దున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త వ్యవసాయ సీజన్‌లో సమృద్ధిగా పంటలు పండించాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.