బాపట్ల మున్సిపల్ కార్యాలయంలోని P-4 కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డుల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించగా, మిగిలిన వాటిని నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు.