గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలి ఎమ్మెల్యే

342చూసినవారు
గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలి ఎమ్మెల్యే
గురువారం నరసాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ పనులను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సందర్శించారు. కళ్ళం సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆలయ పనులు త్వరలోనే పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే పిల్లర్స్ నిర్మాణ పనులలో తన వంతు సహాయాన్ని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్