ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగేశన

1054చూసినవారు
ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగేశన
సోమవారం బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలోని శివాలయం వద్ద జరిగిన ఏరువాకా పౌర్ణమి కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రైతు పొలంలో జోడెడ్ల నాగలి కట్టి పూజలు చేసి, ఈ సంవత్సరం ప్రకృతి అనుకూలించి పంటలు బాగా పండాలని, రైతులందరూ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్