ఇంకొల్లులో మాస శివరాత్రి: భక్తుల శివ పంచాక్షరి నామ సంకీర్తన

411చూసినవారు
ఇంకొల్లులో మాస శివరాత్రి: భక్తుల శివ పంచాక్షరి నామ సంకీర్తన
ఇంకొల్లు పట్టణంలో శనివారం, మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా స్థానిక గంగా పార్వతి సమేత భీమేశ్వరాలయంలో భక్తులు శివ పంచాక్షరి నామ సంకీర్తన నిర్వహించారు. భీమలింగేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. త్రయోదశి, మాస శివరాత్రి కావడంతో నవగ్రహ పూజ, శివునికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నాయుడు శివరాం, చౌదరి బాబు, నాదెండ్ల పార్థసారథి ఈ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్