శుక్రవారం బాపట్ల రైల్వే స్టేషన్ ను తనిఖీ చేయడానికి విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ ను బాపట్ల
తెదేపా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, బాపట్లలో పలు రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందించారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు ఈ వినతి చేశారు. ఈ కార్యక్రమంలో
తెదేపా పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆంద్రేయ, జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గోపికృష్ణ, జిట్టా శ్రీనివాసరావు, మరియు బాపట్ల బిజెపి నాయకులు పాల్గొన్నారు.