అంబేద్కర్ భవన నిర్మాణం వెంటనే చేపట్టాలి నవతరం పార్టీ

811చూసినవారు
అంబేద్కర్ భవన నిర్మాణం వెంటనే చేపట్టాలి నవతరం పార్టీ
కర్లపాలెం మండల కేంద్రంలో 7 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని దళిత నాయకులు సోమవారం బోరుగడ్డ జీవన్ నేతృత్వంలో "మా భవనం - నా బాధ్యత" నిరసన కార్యక్రమం చేపట్టారు. నవతరం పార్టీ నాయకులు శ్రీ ఎస్. కె కరీం, దామర్ల ప్రకాష్ బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలను నీరుగారుస్తున్నాయని, వెంటనే భవన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్