నో హెల్మెట్ నో ఎంట్రీ. జిల్లా కలెక్టర్ ఆదేశాలు

688చూసినవారు
నో హెల్మెట్ నో ఎంట్రీ. జిల్లా కలెక్టర్ ఆదేశాలు
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఆదివారం కలెక్టర్ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో, సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి రావాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్