సూర్యలంక సముద్రతీరంలో బీచ్ షాకుల పేరుతో మద్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుభాషిణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ఐద్వా నాయకులు నిరసన చేపట్టి, పీజీఆర్ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సూర్యలంక బీచ్‌కు కుటుంబాలతో పాటు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, అలాంటి ప్రాంతంలో మద్యం షాపులు ఏర్పాటు చేస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, మద్యం విక్రయాల వల్ల ప్రమాదాలు పెరగడమే కాకుండా మహిళలు, చిన్నారుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.