వీధిలైట్లు లేక గ్రామస్తుల అవస్థలు పట్టించుకోని అధికారులు

919చూసినవారు
వీధిలైట్లు లేక గ్రామస్తుల అవస్థలు పట్టించుకోని అధికారులు
చందోలు గ్రామ పంచాయతీ పరిధిలోని నదిముల్లపాలెంలో గత 15 రోజులుగా వీధిలైట్లు వెలగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతం కావడంతో అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పూర్తిగా చీకటి అలుముకోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటుండటమే కాకుండా, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని సోమవారం తెలిపారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్