ఇంకొల్లు తాసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు అర్జీలు మాత్రమే

2793చూసినవారు
సోమవారం ఇంకొల్లు తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కేవలం రెండు అర్జీలు మాత్రమే అందాయి. భూమి కొలతలు, భూమి వివాదాలకు సంబంధించిన ఈ అర్జీలను తాసిల్దార్ ఏవిఎస్ శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి పి శ్రీనివాసరావు, వెలుగు ఏపిఎం బి అనురాధ, ఉపాధి ఏపీవో బుల్లియ, సీడీపీఓ సులోచన రాణి, సూపర్వైజర్ సుమలత, హౌసింగ్ శాఖ ఏఈ డీటీ లక్ష్మీకుమారి, సర్వేయర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల, పర్చూరు ప్రాంతాల నుంచి ఈ అర్జీలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్