ఉపాధి హామీ చట్టం మార్చవద్దని గాంధీజీకి వినతిపత్రం

370చూసినవారు
ఉపాధి హామీ చట్టం మార్చవద్దని గాంధీజీకి వినతిపత్రం
బాపట్ల పట్టణంలో శుక్రవారం సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చవద్దని గాంధీజీ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకి 700 రూపాయలు వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడిపత్తుల అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్