తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు చేర్చిన పోలీసులు

4667చూసినవారు
తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రులకు చేర్చిన పోలీసులు
వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జరుగుతున్న తిరునాళ్లలో తప్పిపోయిన మూడున్నరేళ్ల చిన్నారి రిషికాను పోలీసులు క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. తిరునాళ్ల బందోబస్తు విధుల్లో ఉన్న కారంచేడు ఎస్సై ఎస్‌కే ఖాదర్ భాషా ఆధ్వర్యంలోని శక్తి టీమ్ చిన్నారిని భద్రంగా సంరక్షించి, తల్లిదండ్రులను గుర్తించి వారికి అప్పగించింది. పోలీసుల తీరును స్థానికులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్