శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, గురువారం రాత్రి చందోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ రెడ్డిపాలెం టోల్ గేటు వద్ద యువతకు డ్రగ్స్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటివలన శారీరక మానసిక ఆరోగ్యంలో తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తగా ఉండి, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని సూచించారు. శాంతి భద్రతలు పరిరక్షించటంలో పోలీసులకు సహకరించాలని ఆయన సూచనలు చేశారు.