బాపట్ల పట్టణం ప్యాడిసన్‌పేటలోని ఒక రేషన్ షాపులో సోమవారం సివిల్ సప్లై అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బాత్రూంలో అక్రమంగా దాచిపెట్టిన సుమారు మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిల్వలపై విచారణ చేపట్టి, రికార్డులతో సరిపోల్చి పరిశీలించిన అధికారులు, డీలర్‌పై నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటనతో అధికారులు నివ్వెరపోయారు.