మామిడి రైతులకు గిట్టుబాటు ధర: కేంద్ర మంత్రికి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ లేఖ

3613చూసినవారు
మామిడి రైతులకు గిట్టుబాటు ధర: కేంద్ర మంత్రికి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ లేఖ
తోతాపురి మామిడికి సరైన ధర లభించక చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్‌ కడప జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కిలో మామిడి ధర కేవలం 4 నుంచి 6 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఈ నేపథ్యంలో, కర్ణాటక తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులకు ధరల లోటు భర్తీ పథకాన్ని (MIS) తక్షణమే అమలు చేయాలని సోమవారం వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్