సంతమాగులూరు మండలం పాత మాగులూరు గ్రామం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముత్తనపల్లి గ్రామానికి చెందిన బత్తుల బ్రహ్మానందం (53) వినుకొండ వైపు నుంచి టీవీఎస్ ఎక్సెల్‌పై వెళుతున్న క్రమంలో కుక్కను తప్పించబోయి వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.