బహుభాషా కోవిదుడు, సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పుట్టపర్తి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలుగు సాహితీ జగత్తులో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధ్రువతారగా వెలిగారని, "సరస్వతీపుత్ర"గా ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగు సాహిత్యానికి విశిష్టమైన కీర్తిని చేకూర్చిన దిశాలి అని కొనియాడారు.