బాపట్ల మండలంలోని కొండుబొట్లపాలెం గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా విజయోత్సవ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ పాల్గొని, గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.