నిజాంపట్నం మండలం ఆముదాలపల్లిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తెలుగు యువత నిజాంపట్నం మండల అధ్యక్షుడు పందరబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కనకదుర్గ, ఆశ కార్యకర్తలు విజయలక్ష్మి, సుభాషిణి, అంగన్వాడీ కార్యకర్త రత్నజ్యోతి కూడా పాల్గొన్నారు.