గురువారం ముఖ్యమంత్రి బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా విధులకు వెళ్తున్న కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, చెరుకుపల్లి సమీపంలో రిక్షాబండి చెడిపోయి ఇబ్బందులు పడుతున్న వృద్ధుడిని గమనించారు. వెంటనే వాహనం ఆపి, వృద్ధుడి పరిస్థితిని తెలుసుకుని, తన సిబ్బందితో కలిసి స్వయంగా రిక్షాబండిని మెకానిక్ షాప్ వరకు తోసుకుంటూ వెళ్లి మరమ్మతులు చేయించారు. ఈ మానవతా దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఎంపీడీవోను అభినందించారు.