బాపట్ల పట్టణంలోని SNP-అగ్రహారంలో శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రెండవ రోజైన ఆదివారం ఉదయం నిత్య హోమాలు, అష్టోత్తర శతకలశ సహిత విశేష అభిషేకాలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటలకు మహాగణపతి, లక్ష్మీగణపతి, సుదర్శన, నారసింహ, నవగ్రహ సహిత రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరగనుంది.