బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు పదవ తరగతిలో మంచి ప్రతిభ కనబరిచి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించారు. తాటిపర్తి చంద్ర హాసినికి నూజివీడులో, చిడిపూడి నాగభవ్యశ్రీ, బట్టు పూజితలకు ఆర్కే వ్యాలీలో, గుంజి వైష్ణవికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీలలో సీట్లు లభించాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాలలో వీరు అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెరికినపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హెచ్ఎం, స్కూల్ కాంప్లెక్స్, చైర్మన్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.