కర్లపాలెం మండలం ప్యార్లీ మల్లెలవారిపాలెం గ్రామంలో శనివారం ఆటోలో మద్యం తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రయత్నించిన వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో కూలి పనులు చేసుకుని జీవనం సాగించే కుటుంబాలు అధికంగా ఉన్నాయని, మద్యం విక్రయాల కారణంగా కుటుంబాలు నాశనం అవటంతో పాటు ఘర్షణలు జలరేగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు ఎక్స్చేంజి అధికారులకు ఫిర్యాదు చేశారు.