అభివృద్ధి సంక్షేమ ఓర్వలేక వైసీపీ నిందలు నా మన

1586చూసినవారు
అభివృద్ధి సంక్షేమ ఓర్వలేక వైసీపీ నిందలు నా మన
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచకాలు, కుల విభేదాలు సృష్టించేలా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలతో కూడిన పరిపాలన నడుస్తుంటే ఓర్వలేక, గతంలో తాము చేసిన తప్పులు బయటకు వస్తుంటే జగన్ భయపడి తప్పుడు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది నిజమని, సిట్ నివేదిక స్పష్టంగా చెబుతున్నా జగన్ బుకాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్