చిలకలూరిపేట: కాలేజీ బస్సును ఢీకొట్టిన కారు

1371చూసినవారు
చిలకలూరిపేట: కాలేజీ బస్సును ఢీకొట్టిన కారు
చిలకలూరిపేట (M) పసుమర్తి సమీపంలోని హైవేపై సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఇంకొల్లు నుంచి నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలకు విద్యార్థులతో వెళ్తున్న బస్సును, మలుపు వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్