బాపట్ల జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల కలెక్టరేట్లో అక్రిడేషన్ కమిటీ చైర్మన్ హోదాలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి అంశానికి తగిన గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు దమ్ము విజయ్ కుమార్, కాటి కమలాకర్, కావూరి రాజేష్, మరికొంత మంది విలేకరులు పాల్గొన్నారు.