బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్. నేతృత్వంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ తొలి సమావేశం జనవరి 30న కలెక్టరేట్‌లో జరిగింది. ప్రభుత్వ జి.ఓ. ప్రకారం అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమని, వృత్తి నైతిక విలువలు పాటిస్తూ సమాజ హితానికి సేవ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.