క్యాన్సర్ పై విద్యార్థులకు అవగాహన: వేటపాలెం జెడ్పీ హైస్కూల్లో ప్రత్యేక కార్యక్రమం

271చూసినవారు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం జెడ్పీ హైస్కూల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, వేటపాలెం–2 సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం డి. సరోజిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ లక్షణాలు, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో వేటపాలెం మండల విద్యాశాఖాధికారి పురుషోత్తం (ఎంఈఓ), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి. సిరోరాణి విద్యార్థులకు ఆరోగ్య సూచనలు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్