బాపట్ల: స్కూటీ తాళం దొంగిలించి, సైకిళ్లపై పారిపోయిన దొంగలు

159చూసినవారు
బాపట్ల పట్టణంలో కరూర్ వైశ్యా బ్యాంక్ సమీపంలో దొంగలు కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి స్కూటీ ఆపి షాపులోకి వెళ్లగా, అక్కడే ఉన్న యువకుడు స్కూటీ తాళాన్ని దొంగిలించాడు. ఆ తర్వాత, తాళం దొంగిలించిన యువకుడు మరో ఇద్దరితో కలిసి సైకిళ్లపై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో బ్యాంకులు, వాణిజ్య ప్రాంతాల్లో వాహనాలు నిలిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్