చీరాల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక రోజు ముందుగానే శనివారం తెల్లవారుజామున దేవి నూతల గ్రామంలో ప్రారంభమైంది. చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా ప్రతి అవ్వా–తాత చిరునవ్వుతో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే గారు తెలిపారు. చీరాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.