రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం అభినందనీయమని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గురువారం తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 1.03 లక్షల చేనేత కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని, చేనేతల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.