కార్మిక చట్టాల రద్దుకు సీఐటీయూ డిమాండ్, చీరాలలో మానవహారం

1781చూసినవారు
కార్మిక చట్టాల రద్దుకు సీఐటీయూ డిమాండ్, చీరాలలో మానవహారం
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించే విధంగా నూతన లేబర్ కోడ్ చట్టాన్ని రూపొందించిందని, తక్షణమే దాన్ని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సీఐటీయూ పిలుపుమేరకు బ్లాక్ డే సందర్భంగా బుధవారం చీరాల గడియార స్తంభం సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్ బాబురావు, ఎం వసంతరావు, రేఖ ఎలిజిబిత్, జి సుజనా, షకీలా, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్