చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో 430 మీటర్ల పొడవు గల సీసీ రోడ్ల నిర్మాణ పనులను టిడిపి అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామాలలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందని, నిర్మాణ పనులు నాణ్యతతో పటిష్టంగా చేపట్టాలని గుత్తేదారులకు సూచించారు.