గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

1292చూసినవారు
బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో, బాపట్ల జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌డబ్ల్యూఎస్ మన్‌సూర్ బాషా పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు. పి.సుధీర్ జిల్లా అధ్యక్షుడిగా, టి.ఎన్.వి.ఎస్ కృష్ణవేణి అసోసియేట్ అధ్యక్షురాలిగా, ఎస్.కె.మునీర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మొత్తం 26 మంది సభ్యులతో ఏర్పడిన ఈ నూతన కార్యవర్గం, గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో సమన్వయకర్తలుగా పనిచేస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్