ఆటోలో మంటలు: ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం

263చూసినవారు
చీరాల-ఒంగోలు జాతీయ రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ఒక టాటా ఏసీ ఆటోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆటో కింద నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, ఇద్దరు ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించాడు. మంటలు తీవ్రరూపం దాల్చడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఆటో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్