పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నేతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేతన్నలకు శుభవార్తగా ఏప్రిల్ 1 నుంచి చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద హ్యాండ్లూమ్‌లకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.