చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే మాలకొండయ్య

1125చూసినవారు
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే మాలకొండయ్య
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య దేశాయిపేట గ్రామంలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. హ్యాండ్ లూమ్‌కు 200, పవర్ లూమ్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల కరెంట్ బిల్లుల భారం తగ్గుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 1,04,488 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ఏటా సుమారు ₹150 కోట్ల ఉపశమనం లభిస్తుందని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్