గాంధీజీ ఆశయాలు రాజ్యాంగానికి ప్రతిబింబం: వేణుగోపాల్

130చూసినవారు
గాంధీజీ ఆశయాలు రాజ్యాంగానికి ప్రతిబింబం: వేణుగోపాల్
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వేటపాలెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం డి. సరోజిని ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ బోధనలైన సత్యాగ్రహం, అహింస, ప్రేమతత్వం ప్రపంచ శాంతికి మార్గమని ఏపీఎస్ఎస్టిఎఫ్ బాపట్ల జిల్లా నాయకులు యు. వేణుగోపాల్ తెలిపారు. ఆయన ఆశయాలు, ఆలోచనలకు భారత రాజ్యాంగం ప్రతిబింబమని, మత సామరస్యం గల దేశంగా మన దేశం విశిష్టత పొందటానికి గాంధీజీ మార్గం అనుసరించడమే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్