వేటపాలెం మండలంలోని అక్కాయపాలెంలో భూవివాదం సోమవారం సాయంత్రం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఉమాభారతి, గవిని శివరామప్రసాద్ గాయపడ్డారు. మద్యం మత్తులో కొందరు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. స్థానికులు బాధితులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.