చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య బుధవారం వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామంలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మంజూరు పత్రాలను అందజేశారు. చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోందని, గత ప్రభుత్వ హయాంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితమే నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓటమి నాయకులు పాల్గొన్నారు.