చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పూల అలంకరణ సేవలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సహస్రదీపార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. కంచిలో ఏకాంబరేశ్వర స్వామి వారిని పార్వతిదేవి వివాహం చేసుకునే ఘట్టాన్ని తలపించేలా తీర్చిదిద్దిన రంగవల్లుల ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.