చీరాలలో ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

915చూసినవారు
చీరాల పట్టణం విఠల నగర్ లోని మన్నా చర్చి ఆధ్వర్యంలో ఆదివారం మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్ధనలు, సండేస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణ పుర విధులు గుండా మట్టలు చేత పట్టుకొని ఏసు ప్రభుని స్తుతించారు. ఈ సందర్భంగా సంఘకాపరి పాస్టర్ జె.రాజేష్ మట్టల ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో చర్చి యూత్ బృందం, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్