పందేళ్ళపల్లిలో ఏరువాక పౌర్ణమి ప్రారంభించిన ఎమ్మెల్యే

2672చూసినవారు
పందేళ్ళపల్లిలో ఏరువాక పౌర్ణమి ప్రారంభించిన ఎమ్మెల్యే
చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సోమవారం జ్యేష్ఠ శుద్ధ ఏరువాక పౌర్ణమి సందర్భంగా పందేళ్ళపల్లి గ్రామంలో నేలతల్లికి నమస్కరించి, ఎడ్లను అలంకరించి కొత్త సాగు పనులకు శ్రీకారం చుట్టారు. తొలకరి జల్లులతో నేల పదునెక్కిన వేళ, ఆయన రైతులతో కలిసి కొత్త నాగలితో పొలంలో భూమి పూజ చేసి ఏరువాక పౌర్ణమిని ప్రారంభించారు. రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్