చంద్రబాబు ఆదేశాలతో వృద్ధులు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ

570చూసినవారు
ఒకటో తేదీ ఆదివారం కావడంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, చీరాల శాసనసభ్యులు శ్రీ ఎం.ఎం. కొండయ్య యాదవ్ గారి సూచనలతో 31వ తేదీన వృద్ధులు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చీరాలలోని వేటపాలెం మండలం రైల్వే స్టేషన్ రోడ్ లో గల సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి మల్లెం అంజమ్మ గారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సమయానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్