ఎస్సీ కాలనీ మధ్యలో హైటెన్షన్ లైన్ల నిర్మాణం అడ్డుకున్న ప్రజలు

1181చూసినవారు
దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ మధ్యలో నుంచి నూతనంగా నిర్మాణం చేపట్టిన 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణ పనులను కాలనీ వాసులు బుధవారం అడ్డగించారు. సిలోన్ కాలనీ వద్దగల విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి చల్లారెడ్డిపాలెం పంచాయతీ బైపాస్ రోడ్డు వద్ద గల సబ్ స్టేషన్ వరకు కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. గతంలో రెండుసార్లు కాలనీ వాసులు అడ్డుకోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. బుధవారం విద్యుత్ సిబ్బంది స్తంభాలు తీసుకురాగా, కాలనీ మధ్య నుంచి లైన్ ఏర్పాటు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించారు. సమాచారం అందుకున్న ఏడీఏ పెరుగు శ్రీనివాసరావు కాలనీకి వచ్చి ప్రజలతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్