నరసరావుపేటలో ప్రేమించుకున్న దేవర ఉపేంద్ర, పాలపాటి పావనీలు బుధవారం కనపర్తి చర్చిలో వివాహం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించడంతో, రెండో పట్టణ పోలీసులు ఇరువైపుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులు సూచించారు. ఈ సంఘటనతో కథ సుఖాంతమైంది.